అధ్యాత్మ సంకీర్తన
రేకు: 296-1
సంపుటము: 3-554
రేకు: 296-1
సంపుటము: 3-554
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఎందరు గలిగిన నితనిలోనే ముందువెనకలను ముఖ్యం బితఁడే | ॥పల్లవి॥ |
| భవ విదూరుఁ డాపద్బంధుఁడు హరి వివరించి కొలువ వేల్పితఁడు కవతో లక్ష్మీకాంతుఁ డితఁడు రవిశశినేత్రుఁడు రక్షకుఁడు | ॥ఎంద॥ |
| కలిదోషహరుఁడు కారుణ్యనిలయుఁడు వలెననువారికి వరదుఁడు తలఁపు లోనఁ గల తత్త్వం బితఁడు సులభుఁ డితఁ డరసి చూచినను | ॥ఎంద॥ |
| శ్రీవేంకటేశుఁడు చిత్తజగురుఁడు యేవలఁ జూచిన నితఁడే గోవిందుఁ డితనిఁ గొలిచితి మిదివో తోవయుఁ గంటిమి తుదకెక్కితిమి | ॥ఎంద॥ |


