అధ్యాత్మ సంకీర్తన
రేకు: 296-2
సంపుటము: 3-555
రేకు: 296-2
సంపుటము: 3-555
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| కనుఁగొననిది హరికల్పితము తనకు నిందులోఁ దగినంతే | ॥పల్లవి॥ |
| నానాభేదములు నరుల గుణంబులు నానారుచులివి నవపదార్థములు ఔననేదేది యటు గాదనేదేది వానివాని విధి వలసినయట్టు | ॥కనుఁ॥ |
| నడచుఁ బ్రపంచము నడుపే విధముల నడచు మాయ లెన్నఁగరావు విడిచేటివేఁటివి విడువనివేఁటివి పడఁగఁబడఁగ నవి పరచినయట్లు | ॥కనుఁ॥ |
| తెగని కర్మములు దేహధర్మములు తెగని యాసలివె దినదినము తగు శ్రీవేంకటదైవము దాసులు నగుదు రిన్నిటిని నటనలు చూచి | ॥కనుఁ॥ |


