అధ్యాత్మ సంకీర్తన
రేకు: 296-4
సంపుటము: 3-557
రేకు: 296-4
సంపుటము: 3-557
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| మిగిలిన దే మిఁకమీఁదట దేహికి అగపడు నొక పడెఁ డన్నంబు | ॥పల్లవి॥ |
| రతిఁ బగటి వెలుఁగు రాత్రిచీఁకటికి సతము గాదు అది సరికి సరి అతిభోగములకు నార్జించుటకును చతురపు సంపద సరికి సరి | ॥మిగి॥ |
| అలయ పథ్యమున కౌషధము గొనుట చలువకు వేఁడికి సరికి సరి నిలిచిన పుణ్యము నిండుఁబాపములు జలువు వెలువులకు సరికి సరి | ॥మిగి॥ |
| మహి మరణములకు మరి పుట్టుగులకు సహజ మందరికి సరికి సరి యిహమున శ్రీవేంకటేశ్వరుఁ డాత్మకు సహకారి యతఁడు సరికి సరి | ॥మిగి॥ |


