అధ్యాత్మ సంకీర్తన
రేకు: 296-5
సంపుటము: 3-558
రేకు: 296-5
సంపుటము: 3-558
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| తెలుపఁగ రాదిది దేవుని మాయలు ఫల మెఱఁగరు యీ పట్టిన వెఱ్ఱి | ॥పల్లవి॥ |
| పుట్టిరి దివిజులు పురుషోత్తమునం- దట్టే యణఁగిరి యతనందు యిట్టే యీతని యిందరితో సరి- వెట్టి కొలుచుటే పెనువెఱ్ఱి | ॥తెలు॥ |
| హరివరముననే యందరు బదికిరి పరుల వరము గని బడలిరి యసురలు యిరవెఱిఁ గీతని నిందరి లోపల సరిగా మొక్కుట సహజపువెఱ్ఱి | ॥తెలు॥ |
| జీవాంతరాత్ముఁడు శ్రీవేంకటేశుఁడు యేవల శ్రీలక్ష్మి యీతని దేవులు వేవేలు సిరులు వీరె యొసఁగిరని భావించువారికిఁ బట్టదు వెఱ్ఱి | ॥తెలు॥ |


