అధ్యాత్మ సంకీర్తన
రేకు: 297-1
సంపుటము: 3-560
రేకు: 297-1
సంపుటము: 3-560
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నారాయణి
| ఏఁటి విచారము యెక్కడి యాచారము మాటున జీవుఁ డింతేసి మాయలఁ బొరలును | ॥పల్లవి॥ |
| పరగ నూరేండ్ల బ్రతుకునకేకా ధర నన్నియునుఁ గూర్చి దాఁచుకొనేది పొరసి నానాసుఖభోగాలు చింతించుఁ గాని పరమున కీపాటి ప్రయాసపడఁడు | ॥ఏఁటి॥ |
| కడుపు నించుకొరకుఁ గామసుఖమునకేకా చెడని వుద్యోగాలు సేయఁ గోరును మిడిసి లోకములెల్ల మెప్పించ నడచుఁ గాని చిడుముడి హరి మెప్పించే ననలేఁడు | ॥ఏఁటి॥ |
| సారెసారెఁ జచ్చిచచ్చి జననము నొందేదెల్లా వూరఁగల కర్మము లొగిఁ జేయుట మేరలేక నరులను మెచ్చుగఁ గొలుచుఁ గాని కూరిమి శ్రీవేంకటేశుఁ గొలువఁగ లేఁడు | ॥ఏఁటి॥ |


