అధ్యాత్మ సంకీర్తన
రేకు: 297-4
సంపుటము: 3-563
రేకు: 297-4
సంపుటము: 3-563
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| ఒక్కఁడే దైవం బున్నతుఁ డీతఁడు తక్కిన తలఁపులు తప్పుఁదెరువులు | ॥పల్లవి॥ |
| పురుషుల కెల్లాఁ బురుషోత్తముఁడు సురేంద్రాదులకు సురేంద్రుఁడు హరునికి నజునికి నవ్వలిమూరితి హరి ఇతఁడే పరమాత్ముఁడు | ॥ఒక్కఁ॥ |
| వేదాంతంబుల వేద్యుఁ డీతఁడు ఆదికినాదియు నన నితఁడే మేదిని నరులకు మేదినీశ్వరుఁడు యేదెసఁ జూచిన నీశ్వరుఁ డితఁడే | ॥ఒక్కఁ॥ |
| యెక్కువల కెల్ల నెక్కువ యీతఁడు మక్కువ మరునికి మరుఁ డితఁడు యిక్కడ శ్రీవేంకటేశుఁడై మిగుల పక్కన నిదివో ప్రత్యక్ష మితఁడు | ॥ఒక్కఁ॥ |


