అధ్యాత్మ సంకీర్తన
రేకు: 297-6
సంపుటము: 3-565
రేకు: 297-6
సంపుటము: 3-565
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| వేదము దీర్చదు వేరే శాస్త్రములు యేదియుఁ దీర్చదు యిది నీమాయ | ॥పల్లవి॥ |
| నీ వల్ల బ్రదికిరి నిండు దేవతలు నీవల్ల నసురలు నెఱిఁ జెడిరి ఆవల నిందరి కాత్మవు నీవే చేవదేరె నీ చిక్కులే భువిని | ॥వేద॥ |
| నెమ్మిఁ బాండవుల నీవారంటివి కమ్మర విడిచితి కౌరవుల యిమ్ముల నీవావి యిద్దరికొకటే తెమ్మలాయ నీ తీరని చిక్కు | ॥వేద॥ |
| జగమున నీదే స్వతంత్రమెల్లా నెగడిన జీవులు నీవారు తగు శ్రీవేంకటదయివమ యిన్నియు తెగి నీదాసులు తెలిసిన చిక్కు | ॥వేద॥ |


