అధ్యాత్మ సంకీర్తన
రేకు: 301-2
సంపుటము: 4-2
రేకు: 301-2
సంపుటము: 4-2
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| నాకు నాకే సిగ్గయ్యీని నన్ను జూచుకొంటేను చేకొని నీవే మన్నించఁ జెయ్యొగ్గేఁ గాని | ॥పల్లవి॥ |
| సేయరాని పాపములు సేసివచ్చి యేనోర నాయెడ నిన్ను వరములడిగేను కాయముతో నింద్రియకింకరుఁడనై యేమని చేయార నీబంటనని చెప్పుకొనేను | ॥నాకు॥ |
| వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి యేగతిఁ గొసరి నీపై నేఁట వేసేము అగడపు బంగారుకాతుమనే నమ్ముకొని భోగపుమోక్షము నెట్టు వొందించు మనేము | ॥నాకు॥ |
| కలుపుట్టుగుబదుకు కాంతలకు వెచ్చపెట్టి వలసి నేఁడెట్టు నీవార మయ్యేము నెలవై శ్రీవేంకటేశ నీవే కరుణించితివి బలిమిసేసి నీకెట్టు భారము వేసేము | ॥నాకు॥ |


