అధ్యాత్మ సంకీర్తన
రేకు: 303-6
సంపుటము: 4-18
రేకు: 303-6
సంపుటము: 4-18
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| నీకు నీవే వలసితే నీవు నన్నుఁ గాచుకొమ్ము నాకు వసగానివెల్ల నన్నుఁ బాసీనయ్యా | ॥పల్లవి॥ |
| పాపమూల మటు తొల్లి పైకొన్న దేహము పాపము సేయకుండితే పక్కున నేల మాను కోపమే కూడుగఁ గుడిచిన యీబుద్ధి కోపము విడువుమంటే గుణమేల మాను | ॥నీకు॥ |
| అప్పు దీర్చ వచ్చినట్టి ఆయపు సంసారము అప్పు దీర్చుకోకుమంటే నది యేమిటికి మాను తప్పు వేయవచ్చి నన్నుఁ దగిలె నీ కర్మములు తప్పులు వేయక సారెఁ దా మేల మాను | ॥నీకు॥ |
| పంచమహాపాతకాలే పట్టుకొనే యింద్రియాలు పంచమహాపాతాకాలే బారిఁ దోయ కేల మాను అంచెల శ్రీవేంకటేశ ఆత్మలో నీవుండఁగాను పొంచి నీ కరుణ నన్నుఁ బొదుగ కేల మాను | ॥నీకు॥ |


