అధ్యాత్మ సంకీర్తన
రేకు: 309-3
సంపుటము: 4-51
రేకు: 309-3
సంపుటము: 4-51
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| అన్నివిధములుఁ దానై యాతుమలో మరి వీఁడే పన్నిన యీ పరమాత్మభావనే మా బ్రదుకు | ॥పల్లవి॥ |
| గోపాలకృష్ణునిచూపే కోరిన పనులపాఁడి గోపికావల్లభుకృపే కూర్మివనిత శ్రీపతిదయే మాకుఁజేరే ధనధాన్యములు చేపట్టిన బ్రహ్మతండ్రిచిత్తమే మాపుత్రులు | ॥అన్ని॥ |
| జలధిశాయికరుణే సర్వరత్నములసొమ్ము అల పీతాంబరువాత్సల్యమే వస్త్రములు మలయు గరుడధ్వజుమన్ననే వాహనములు యిల నచ్యుతనామమే యిదే మాకాయుష్యము | ॥అన్ని॥ |
| అమృతమథను మహిమదె మా గాదెల కొల్చు విమతదైత్యారి యావేశమే భయహరము అమర శ్రీవేంకటేశు నడుగులే మాకు నిండ్లు తమితో నాతనిదేవే తల్లియుఁ దండ్రియును | ॥అన్ని॥ |


