అధ్యాత్మ సంకీర్తన
రేకు: 310-2
సంపుటము: 4-56
రేకు: 310-2
సంపుటము: 4-56
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| కాకున్న మాపాటు కడమున్నదా నీ కృప వంకనే నిలిచితిఁ గాక | ॥పల్లవి॥ |
| యీ నాలికేకాదా యిందరి నిందించినది శ్రీనిధి నిన్నుఁ బొగడి చెలఁగెఁ గాక నానాపాపములు విన్న నా వీనులే కావా దానవారి నీ కథల ధన్యమాయఁగాక | ॥కాకు॥ |
| యీ మేనేకాదా హేయపుటింతులఁ గూడె నీముద్రలు ధరియించి నిక్కెఁగాక యీ మనసేకాదా యిన్నిటిపైఁ బారినది కామించి నిన్నుఁ దలఁచి కట్టువడెఁ గాక | ॥కాకు॥ |
| యీ పుట్టుగేకాదా హీనాధికములఁ బొందె వోపి నీ దాస్యము చేరి వొప్పెఁగాక యేపున శ్రీవేంకటేశ యిన్నినేరములు నాకుఁ బాపఁగా నే నిన్ను నమ్మి బ్రదికితిఁగాక | ॥కాకు॥ |


