అధ్యాత్మ సంకీర్తన
రేకు: 310-4
సంపుటము: 4-58
రేకు: 310-4
సంపుటము: 4-58
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| కాయము నాదే అట కర్తను నే నట నా- చాయకవి రావు నన్నే జరసీఁ గాని | ॥పల్లవి॥ |
| తలఁచినట్టుండదు తలఁపు నాదైనాను కులికి నన్నే పనిగొనీఁగాని నిలిపిన యట్టుండవు నేఁడు నా మాటలే నాకు పొలసి నన్నే కడు బొంకించీఁగాని | ॥కాయ॥ |
| కలిమి లేమెరఁగదు కాయము నాదైనాను కొలఁదికి నేమైనాఁ గోరీఁగాని యిల నాయంకెకు రావు యింద్రియములు నావైనా కలసి నామర్మములే కాఁడిపారీఁగాని | ॥కాయ॥ |
| పంపు నాకుఁ జేయదు భవమిది నాదైనా తెంపున కర్మవీధులఁ దిప్పీఁ గాని యింపుల శ్రీవేంకటేశ యిది యరాజికమాయ పంపున నీకిదె మొఱ ప్రతిపాలించఁగదే | ॥కాయ॥ |


