అధ్యాత్మ సంకీర్తన
రేకు: 311-1
సంపుటము: 4-61
రేకు: 311-1
సంపుటము: 4-61
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| ఱాలు దింటా మలిగండ్లాఱడి రాసిగా నేరేము తేలుచు శ్రీహరి నీవే దిక్కౌట గాక | ॥పల్లవి॥ |
| ఆసలేల మానుఁ దన ఆఁకలి లో నుండఁగాను బేసబెల్లి దేహముతోఁ బెరుగుఁగాక గాసి బంధమేలఁమానుఁ గాముఁడు లో నుండఁగాను వేసట సంసారమై వెన్నడించుఁగాక | ॥ఱాలు॥ |
| ధావతులేఁటికి మానుఁ దనుభోగాలుండఁగాను మోవరాని చింతలతో ములుగుఁగాక కావరములేల మాను కంతల మేనుండఁగాను తోవ చేసుకొని వెళ్లఁదోయుచుండుఁగాక | ॥ఱాలు॥ |
| వొక్కచిత్తమేలయౌను వూర్పుగాలి విసరఁగా చిక్కి గుణత్రయముచేఁ జెదరుఁగాక నిక్కి శ్రీవేంకటపతి నీకు నేనే శరణంటి గక్కన నీజీవమును గరుణింతుగాక | ॥ఱాలు॥ |


