అధ్యాత్మ సంకీర్తన
రేకు: 312-3
సంపుటము: 4-69
రేకు: 312-3
సంపుటము: 4-69
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| పంతపుటాసలు బండ్ల రాఁగా దొంతుల యలమటఁ దొలఁగేనా | ॥పల్లవి॥ |
| మును దీపనాగ్ని మోఁచిన దేహిని అనిశముఁ గ్రోధాగ్ని నణఁచేనా మనసిజుకతమున మహి జన్మించితి విను మరునాజ్ఞకు వెలి యయ్యేనా | ॥పంత॥ |
| సటలోభపు సంసారము చొచ్చితి ఘటన విడుము డిఁకఁ గలిగీనా నటించు చపలపు నాలుక గల నే మటమాయపు చవి మానేనా | ॥పంత॥ |
| పాపపుణ్యముల భవముల జీవిని తోపడ కర్మము దొబ్బేనా యేపున శ్రీవేంకటేశ్వరు శరణమే పైపయి భజించి బ్రదికితిఁగాక | ॥పంత॥ |


