అధ్యాత్మ సంకీర్తన
రేకు: 314-4
సంపుటము: 4-81
రేకు: 314-4
సంపుటము: 4-81
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నారాయణి
| హరిశరణాగతి యాతుమది సరుస నిదియ పో సతమయ్యెడిది | ॥పల్లవి॥ |
| దినదినరుచులివి దేహమువి చెనకేటికోరిక చిత్తముది యెనసేటికాంతలు యింద్రియంబులవి పనివి యాత్మకివి పనిలేదయ్యా | ॥హరి॥ |
| పదరేటికోపము పావముది అదనఁ గాలములు అనాదివి నిదుర తమోగుణ నిలయముది యెదుట నాత్మకివి యెరవెరవయ్యా | ॥హరి॥ |
| కాయపు జననము కర్మముది మాయలంపటము మమతలది యేయెడ శ్రీవేంకటేశుఁ డితనికృప పాయనియాత్మకుఁ బ్రమాణమయ్యా | ॥హరి॥ |


