అధ్యాత్మ సంకీర్తన
రేకు: 315-5
సంపుటము: 4-88
రేకు: 315-5
సంపుటము: 4-88
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| హరికే మెుఱవెట్టు టంతేకాక గరిమ వేరొకటను గతి గానవచ్చునా | ॥పల్లవి॥ |
| పాపపుణ్యాలంపటాలఁ బరగిన జీవునికి- నోపననవచ్చునా వొడలి మోపు కోపపు శాంతము చేతఁ గొట్టువడ్డప్రాణికి తాపపు కర్మపువెట్టి తప్పంచుకోవచ్చునా | ॥హరికే॥ |
| ఆఁకటి నీరువట్టుల కగపడ్డదేహికి తోఁకసంసారపుటాజ్ఞ తోయవచ్చనా సోఁకుసుఖదుఃఖములఁ జొచ్చినజంతువునకు మూఁకల లోకపులగ్గములఁ బాయవచ్చునా | ॥హరికే॥ |
| సారె రాత్రిఁ బగటాను చచ్చిపుట్టేజంతువుకు భారపుటాసల లోనఁ బాయవచ్చునా యీరీతి శ్రీవేంకటేశు నిటు శరణన్నఁగాక ధారుణిఁ బంచబాణము దప్పుకొనవచ్చునా | ॥హరికే॥ |


