అధ్యాత్మ సంకీర్తన
రేకు: 316-6
సంపుటము: 4-95
రేకు: 316-6
సంపుటము: 4-95
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| దైవమ నీవే దయదలఁచుట గా- కావలఁ బ్రాణికి యా(నా?)సేదయ్యా | ॥పల్లవి॥ |
| ఆస వొకటి యెంతయినాఁ దనియదు వాసి యెుకటి తనవంతులు మానదు యీసొకటి శాంతమెరఁగని దిదె మోసపుదేహికి ముక్తి యే దయ్యా | ॥దైవమ॥ |
| పాపమెుకటి భవబంధముఁ బాపదు దీపమెుక్కటి ధీరత యెుల్లదు చూపొక టింద్రియసుఖముల గెలువదు యేపునఁ బ్రాణికి యెఱకే దయ్యో | ॥దైవమ॥ |
| పాయమెుకటి చాపలములు మానదు కాయమెుకటి తనకర్మము విడువదు యీయెడ శ్రీవేంకటేశ్వర నీసేవ సేయని యాత్మకు సెలవే దయ్యా | ॥దైవమ॥ |


