అధ్యాత్మ సంకీర్తన
రేకు: 323-1
సంపుటము: 4-130
రేకు: 323-1
సంపుటము: 4-130
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో రీతిగాదు హరి నెచ్చరికె సేయరే | ॥పల్లవి॥ |
| పైపై బొద్దువొడచి పంకజములు విరిసె గోప గోవిందుని మేలుకొన మనరే దీపములు దెల్లఁబారె తిమిరమింతయు జారె శ్రీపురుషోత్తమునిఁ జేయంటి లెమ్మనరే | ॥రాతి॥ |
| కలువలు ముకుళించీ కలవింక లెలుగించీ నెలఁతలు దేవదేవు నిద్ర దెల్పరే జలనిధి పొంగణగె చాయలచుక్కలు మాసె వలరాచగురు నుప్పవడము గమ్మనరే | ॥రాతి॥ |
| జీవులు మేలుకొనిరి చెంగలించె దరువులు భావించి యచ్యుతునిట్టె పలికించరే కావిరింతయు విరిసె కడు సంధ్యకు బొద్దాయ శ్రీవేంకటేశుని విచ్చేయ మనరే | ॥రాతి॥ |


