అధ్యాత్మ సంకీర్తన
రేకు: 323-5
సంపుటము: 4-134
రేకు: 323-5
సంపుటము: 4-134
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భవుళి
| పురుషుఁడే యధముఁడు పొంచి యెందుఁ దగులక పురుషోత్తమునికంటే పుణ్యుఁడవు నపుడే | ॥పల్లవి॥ |
| పురుషజంతువులెల్ల పొంచి యాఁడుజంతువుల తరవాయి గొని వెంటఁ దగులుఁగాని ధర నాఁడు జంతువులు తగ పురుషజంతువుల యిరవు వెదకఁజోవు యిది యెట్టిమాయో | ॥పురు॥ |
| సారెకు నర్ధమునకు జనులెల్ల దాసులై కోరి వెదకుచు దిరుగుదురు గాని చేరువ యర్ధములెల్ల జీవులకు దాసులై యీరీతి వెదకవు యిది యెట్టిమాయో | ॥పురు॥ |
| లోకమునడవ డిది లోనుగాక యిందుకెల్లా యేకచిత్తమున నుంటే యెక్కుడుగాని దాకొని శ్రీవేంకటేశు దాసుఁడైన వానికిని యేకముగఁ బంపుసేసు నేమిమాయోకాని | ॥పురు॥ |


