అధ్యాత్మ సంకీర్తన
రేకు: 324-4
సంపుటము: 4-139
రేకు: 324-4
సంపుటము: 4-139
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| శ్రావణబహుళాష్టమి జయంతి నేఁడు సేవించరో నరులాల శ్రీకృష్ణుఁడిఁతఁడు | ॥పల్లవి॥ |
| భావింప వసుదేవుని పాలిటి భాగ్యదేవత దేవకి గనినయట్టి దివ్యరత్నము చేవమీర సురల రక్షించే కల్పతరువు యీవేళ జన్మించినాఁడు యిదె కృష్ణుఁడు | ॥శ్రావణ॥ |
| హర విరంచాదులకు నాదిమూల కారణము పరమమునుల తపఃఫల సారము గరుడోరగేంద్రులకుఁ గలిగిన నిధానము యిరవుగా నుదయించెనిదె కృష్ణుఁడు | ॥శ్రావణ॥ |
| బలుయోగీశ్వరుల బ్రహ్మానందము చెలఁగు భాగవతుల చింతామణి అలమేల్మంగకు బతియట్టె శ్రీవేంకటాద్రి- నిలపై జన్మించినాఁడు యిదె కృష్ణుఁడు | ॥శ్రావణ॥ |


