అధ్యాత్మ సంకీర్తన
రేకు: 328-5
సంపుటము: 4-164
రేకు: 328-5
సంపుటము: 4-164
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| జూటుఁదనాలవాఁడవు సుగ్రీవనారసింహ పాటించి నిన్ను నేము పంగించేవారమా | ॥పల్లవి॥ |
| మొగము సింహపురూపు మెుగి మై మానిసిరూపు జిగిఁ దొడవిూఁదట శ్రీమహాలక్ష్మి తగు నీకు నిటువంటి తగవులెల్లాఁ జెల్లు యెగ సక్కేలాడ మాకు నేలయ్య నిన్నును | ॥జూటుఁ॥ |
| కట్టినది పైఁడికాశ కంబములోన వునికి నెట్టుకొన్ననవ్వులు నీలోనివే యిట్టివల్లా నీకమరు యెన్నిలేవు నీచేఁతలు అట్టిట్టని నిన్ను మాకు నడుగనేమిటికి | ॥జూటుఁ॥ |
| అమరుల కేలికవు అసురలకు వైరవి రమణఁ బ్రహ్లదునకు రక్షకుఁడవు కొమరై శ్రీవేంకటాద్రిఁ గొత్తలు నీగుణములు సముకానఁ బలుమారు సంతోసించే మిఁకను | ॥జూటుఁ॥ |


