అధ్యాత్మ సంకీర్తన
రేకు: 329-1
సంపుటము: 4-166
రేకు: 329-1
సంపుటము: 4-166
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| లెండో లెండో మాటాలించరో మీరు కొండలరాయనినే పేర్కొన్నదిదె జాలి | ॥పల్లవి॥ |
| మితిమీరెఁ జీకట్లు మేటితలవరులాల జతనము జతనము జాలో జాలి యితవరులాల వాయించే వాద్యాలకంటె- నతిఘోషములతోడ ననరో జాలి | ॥లెండో॥ |
| గాములువారెడిపొద్దు కావలికాండ్లాల జాము జాము దిరుగరో జాలో జాలి దీమనపు పారివార దీవెపంజులు చేఁబట్టి యేమరక వమీలో మీరు యియ్యరో జాలి | ॥లెండో॥ |
| కారుకమ్మె నడురేయి గడచెఁ గట్టికవార సారెసారెఁ బలుకరో జాలో జాలి యీరీతి శ్రీవేంకటేశుఁ డిట్టె మేలుకొన్నాఁడు గారవాన నిఁక మానఁ గదరో జాలి | ॥లెండో॥ |


