అధ్యాత్మ సంకీర్తన
రేకు: 329-5
సంపుటము: 4-170
సంస్కృతకీర్తన
రేకు: 329-5
సంపుటము: 4-170
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| శరణు శరణు దేవ సర్వపోషక కరుణానిలయ రామ కౌసల్యనందన | ॥పల్లవి॥ |
| వారిధిబంధన రావణ శిరశ్ఛేదక మారీచను బాహుబలమర్దన దారుణ కుంభకర్ణ దనుజ సంహారక వీరప్రతాప రామ విజయాభిరామ | ॥శర॥ |
| సవనరక్షక మునిజనకుల నిర్వాహక దివిజవంద్య కపిసేనానాయక వివిధ సప్తతాల విధ్వంసన చతుర భువనేశ సాకేతపురవాస రామ | ॥శర॥ |
| హరచాపహర అహల్యాశాప విమోచక ఖరశర వాలినిగ్రహ బిరుద నిరతి శ్రీవేంకటేశ నిజభక్తరక్షక ధరణిజా సమేత దశరథరామా | ॥శర॥ |


