అధ్యాత్మ సంకీర్తన
రేకు: 330-1
సంపుటము: 4-172
రేకు: 330-1
సంపుటము: 4-172
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవక్రియ
| విచ్చనవిడినీ యాడీ వీఁడె కృష్ణుఁడు వొచ్చము లేనివాఁడు వుద్దగిరికృష్ణుఁడు | ॥పల్లవి॥ |
| గల్లుగల్లుమనఁగాను గజ్జలు నందెలతోడ బిల్లఁగోట్లాడీని పిన్నకృష్ణుఁడు కెల్లురేఁగి వీధులనుఁ గేరి పుట్టచెండులాడీ బల్లిదుఁడు గదవమ్మ బాలకృష్ణుఁడు | ॥విచ్చ॥ |
| తమితోడ గోపాలులు తానుఁ గూడి ముంగిటను సముద్రబిల్లలాడీ సాధుకృష్ణుఁడు చెమటలుగార సిరసింగనవత్తి యాడీ గుమితాన వీఁడే యమ్మా గోపాలకృష్ణుఁడు | ॥విచ్చ॥ |
| వుదుటునఁ బారి పారి వుడ్డగచ్చకాయలాడీ ముదముదొలఁకఁగాను ముద్దుకృష్ణుఁడు అదివో శ్రీవేంకటేశుఁ డాటలెల్లాఁ దానే యాడీ పదివేలు చందాల శ్రీపతియైన కృష్ణుఁడు | ॥విచ్చ॥ |


