అధ్యాత్మ సంకీర్తన
రేకు: 330-5
సంపుటము: 4-176
రేకు: 330-5
సంపుటము: 4-176
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| కొసరనేల నాగుణము లివి రసికత నీవిన్నిటా రక్షించుకొనుమీ | ॥పల్లవి॥ |
| నేరమి నాది నేరుపు నీదే దూరు నాది బంధుఁడవు నీవు కోరుదు నేను కొమ్మని యిత్తువు కారుణ్యాత్మక గతి నీవు సుమీ | ॥కొస॥ |
| నేను యాచకుఁడ నీవేదాతవు దీనుఁడ నేఁ బరదేవుఁడవు జ్ఞానరహితుఁడను సర్వజ్ఞనిధివి శ్రీనిధి యిఁక ననుఁ జేరి కావుమీ | ॥కొస॥ |
| అరయ నే జీవుఁడ నంతర్యామివి యిరవుగ దాసుఁడ నేలికవు చిరజీవిని నే శ్రీవేంకటపతివి వరదుఁడ ననుఁ జేవదలకుమీ | ॥కొస॥ |


