అధ్యాత్మ సంకీర్తన
రేకు: 331-2
సంపుటము: 4-179
రేకు: 331-2
సంపుటము: 4-179
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భల్లాటి
| జగతిలో మనకెల్ల జయంతి నేఁడు పగటున నందరికి పండుగ నేఁడు | ॥పల్లవి॥ |
| అదివో శ్రావణ బహుళాష్టమి నేఁడు పొదిగొన్న రోహిణి సంపూర్ణము నేఁడు కదిసి యద్దమరేత్రికాడ నేఁడు ఉదయించెఁ గృష్ణుఁడు చంద్రోదయాన నేఁడు | ॥జగ॥ |
| వసుదేవదేవకుల వరము నేఁడు పసగా ఫలియించె రేపల్లెలో నేఁడు కొసరి యశోదనందగోపుఁడు నేఁడు - యీ సిసువును సుతుఁడంటాఁ జెలఁగిరి నేఁడు | ॥జగ॥ |
| హరిమాయ కంసుమద మడఁచె నేఁడు పొరుగిరుగులవా రుప్పొంగిరి నేఁడు సిరి నలమేల్మంగతో శ్రీవేంకటేశుఁడై నిల్చె అరుదుగా గొల్లెతలు ఆడుకొనేరు నేఁడు | ॥జగ॥ |


