Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 332-2
సంపుటము: 4-185
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
వైష్ణవులసొమ్ము నేను వారు నీ సొమ్ములింతే
విష్ణుఁడ నీవెట్టైన వివరించుకోవయ్యా
॥పల్లవి॥
నెఱి నీబంటనా హరి నీకంటె బలువులైన-
తఱి నీదాసులకే నే దాసుఁడగాక
గుఱుతెరుఁగుదునా నేఁ గోరి యింతకతొల్లి
గుఱుతు చూపిన మాగురువునేకాక
॥వైష్ణ॥
ముంచి నీకు మొక్కేఁగాక ముందే నీశరణులు
పెంచి పాదాలు నా నెత్తిఁబెట్టిరయ్య
పొంచి నీవేడ నేనేడ బుజముల ముద్రవెట్టి
సంచితమై సేసినట్టిసంబంధమేకాక
॥వైష్ణ॥
శ్రీవేంకటేశ నీసేవే సేసేఁగాక నే డీ-
సేవకుఁ దెచ్చెను వారిసేవేకాదా
భావమొక్కటిగా నాకుఁ బట్టిచ్చిరి నిన్ను వారు
ఆవలీవలికిఁ బరమార్థమేకాక
॥వైష్ణ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము