అధ్యాత్మ సంకీర్తన
రేకు: 332-5
సంపుటము: 4-188
రేకు: 332-5
సంపుటము: 4-188
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
| కర్మమూలము జగము గాదని విడువక మర్మపు మోక్షము లేదు మానలేరో గర్వము | ॥పల్లవి॥ |
| సకలకర్మాలు మాని సన్యాసి యైతేను వొకట వెలితిలేనివున్నతుఁడట ముకెమై వుభయకర్మములు బంధహేతువని ప్రకటించి వేదాంతపఠనమే యెక్కుడు | ॥కర్మ॥ |
| బహురూపములు మరచి బ్రహ్మ నిష్ఠుఁడైనయోగి యిహపరముల కతఁడెక్కుడట విహితకర్మము దక్క వీరఘోరకర్మములు సహజపాతకమనేశాస్త్రాలే యెక్కుడు | ॥కర్మ॥ |
| సంతతకర్మములెల్ల సంసారమూలములు అంతట నిస్సంగుడైతే నధికుఁడట చింతించి చింతించి శ్రీవేంకటేశ్వరు వంతుకుఁజెప్పన హరివాక్యమే యెక్కుడు | ॥కర్మ॥ |


