అధ్యాత్మ సంకీర్తన
రేకు: 332-6
సంపుటము: 4-189
రేకు: 332-6
సంపుటము: 4-189
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| పుట్టించినవాఁడు దానే బుద్ధిచెప్పేవాఁడు దానే యిట్టె శ్రీహరి నన్నే ట్టీడేరించీనో | ॥పల్లవి॥ |
| యెంచుకొందు నొకవేళ నేఁటి సంసారమిదని యించుకవడిలోనే మోహింతు నందుకు కంచువంటి దీమనసు కటకటా యేది వాటి చంచలుఁడ హరి నన్నేసంగతి సేసీనో | ॥పుట్టించి॥ |
| తలఁతు నేనొకవేళ దైవము గనేనని కలిమి నంతటిలోనె కడు మరతు చలపట్టె నిదివో నాజన్మములకేది వాటి కలుషచిత్తుఁడ నన్నేకందువఁ బెట్టీనో | ॥పుట్టించి॥ |
| జ్ఞానినౌదు నొకవేళ సరిఁ గర్మినౌదును మానువంటిదీగుణము మరేది వాటి కోనల శ్రీవేంకటేశుఁ గొలిచి నే శరణంటి మానిసి నింతే యెట్టు మన్నించీనో | ॥పుట్టించి॥ |


