అధ్యాత్మ సంకీర్తన
రేకు: 333-3
సంపుటము: 4-192
రేకు: 333-3
సంపుటము: 4-192
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రం
| హరియవతారమె ఆతఁ డితఁడు పరమసంకీర్తనఫలములో నిలిపె | ॥పల్లవి॥ |
| వున్నాఁడు వైకుంఠమున నున్నాఁడు యాచార్యునొద్ద వున్నతోన్నతమహిమ నన్నమయ్య వున్నవి సంకీర్తనాలు వొట్టుక లోకములందు పన్నిన నారదాదులు పైపైఁ బాడఁగను | ॥హరి॥ |
| చరియించు నొకవేళ సనకాదిమునులలో హరిఁ బాడుఁ దాళ్ళపాకఅన్నమయ్య తిరమై యాళువారల తేజము దానైయుండు గరుడానంతముఖ్య ఘనులంగడిని | ॥హరి॥ |
| శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతికొలువునందు ఆవహించెఁ దాళ్ళపాకఅన్నమయ్య దేవతలు మునులును దేవుఁడని జయవెట్టఁ గోవిదుఁడై తిరిగాడీఁ గోనేటిదండను | ॥హరి॥ |


