అధ్యాత్మ సంకీర్తన
రేకు: 333-5
సంపుటము: 4-194
రేకు: 333-5
సంపుటము: 4-194
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| నీకే నే శరణు నీవు నన్నుఁ గరుణించు యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నా రిఁకను | ॥పల్లవి॥ |
| కన్నులఁ జంద్రసూర్యులుగలవేలుపవు నీవు పన్నినలక్ష్మిభూమిపతివి నీవు అన్నిటా బ్రహ్మకుఁ దండ్రియైన యాదివేలుపవు యెన్నఁగ నీకంటే ఘన మెవ్వరున్నా రిఁకను | ॥నీకే॥ |
| దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి ఆవలఁ బాదాన లోక మణఁచితివి నీవొక్కఁడవే నిలిచిన దేవుఁడవు యేవేళ నీకంటే నెక్కుడెవ్వరున్నా రిఁకను | ॥నీకే॥ |
| అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ పురుషోత్తముఁడవు భువనరక్షకుఁడవు యిరవైననీవేకాక యెవ్వరున్నా రిఁకను | ॥నీకే॥ |


