అధ్యాత్మ సంకీర్తన
రేకు: 334-3
సంపుటము: 4-198
రేకు: 334-3
సంపుటము: 4-198
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఇంత లేకుంటే నది యెక్కడి సుజ్ఞానము దొంతుల తన జన్మము తొల్లిటిదే కాదా | ॥పల్లవి॥ |
| యెదిటి వారెరిఁగితే యేమీ ననక మరి చెదరకుండుటే పో శ్రీవైష్ణవం కదిసినకాంతలను కనకము వొడగంటే పదరకుండుటే పో పరమసాత్వికము | ॥ఇంత॥ |
| క్రియయెరఁగనివారు కీడు సేసితేఁ దాను దయఁ జూచుటే హరిదాస్యఫలము రయమునఁ దామసము రాజసము గలిగితే భయపడి తొలఁగుటే ప్రసన్నగుణము | ॥ఇంత॥ |
| వొరసి యెవ్వఁడు దను నుబ్బించి పొగడిన నిరతితొ వీఁగనిదే నిచ్చలబుద్ది యిరవై శ్రీవేంకటేశ్వరుదాసులఁ గని శరణని మొక్కుటే సర్వజ్ఞగుణము | ॥ఇంత॥ |


