అధ్యాత్మ సంకీర్తన
రేకు: 334-4
సంపుటము: 4-199
రేకు: 334-4
సంపుటము: 4-199
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| పరమోపకారులు ప్రత్యక్షదైవములు హరిదాసు లిత్తురు బ్రహ్మానందసుఖము | ॥పల్లవి॥ |
| పాపుదురు లోకములో పాపపంకమెల్లాను దీపించ శ్రీపాదతీర్థమున వోపుదురు హీనుల వున్నతులఁగాఁ జేయ చేపట్టి కన్నులెదుటిసేవామాత్రమున | ॥పర॥ |
| చెఱుతు రజ్ఞానమెల్లా జనులు తమ్ముఁజేరిన మఱియుఁ దమప్రసాదమహిమవల్ల తెఱచిత్తురు మోక్షము తెరువు ప్రాణులకెల్లా మొఱఁగి మూలనుండి మొక్కినమాత్రమున | ॥పర॥ |
| చెల్లఁబెట్టుదు రెందైనా చిల్లరకులమువారి తెల్లమిగా మంత్రోపదేశమున యిల్లిదె శ్రీ వేంకటేశ యెక్కుడుసేసిరి మమ్ము సల్లాపనల తమసహవాసములను | ॥పర॥ |


