అధ్యాత్మ సంకీర్తన
రేకు: 334-5
సంపుటము: 4-200
రేకు: 334-5
సంపుటము: 4-200
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| నాకుఁ గల పని యిదె నారాయణుఁడ నీవు శ్రీకాంతుడవు నాకు సిద్ధించుకొరకు | ॥పల్లవి॥ |
| జలధివంటిది సుమీ చంచలపు నామనసు కల వింద్రియముల నేటిజలచరములు వొలసి భక్తెనెడి వోడ యెక్కితి నేను జలశాయి నీవ నేటిసరకు దెచ్చుటకు | ॥నాకు॥ |
| కొండవంటిది సుమీ కొనకెక్కు నామనసు వుండుఁ గామాదులను వురుమృగములు వుండి నీశరణమను వూఁత గొని యెక్కితిని కొండలప్ప నీవనేటి కొనఫలముకొరకు | ॥నాకు॥ |
| టీవులను ధరణివంటిది సుమీ నామనసు నీవె శ్రీవేంకటేశ నిక్షేపము వావాత నీవనేటి వసిదవ్వి కైకొంటి భూవిభుఁడ నీవనేటి పురుషార్థము | ॥నాకు॥ |


