అధ్యాత్మ సంకీర్తన
రేకు: 334-6
సంపుటము: 4-201
రేకు: 334-6
సంపుటము: 4-201
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంభోది
| అంతటనే వచ్చి కాచు నాపద్బంధుఁడు హరి వంతుకు వాసికి నతనివాఁడనంటేఁ జాలు | ॥పల్లవి॥ |
| బంతిఁగట్టి నురిపేటి పసురము లెడ నెడఁ బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు చెంతల సంసారము సేయు నరుఁడందులోనె కొంత గొంత హరి నాత్మఁ గొలుచుటే చాలు | ॥అంత॥ |
| వరుసఁ జేఁదు దినేవాడు యెడ నెడఁ గొంత సరవితోడుతఁ దీపు చవిగొన్నట్టు దురితవిధులు సేసి దుఃఖించు మానవుఁడు తరవాత హరిపేరు దలఁచుటే చాలు | ॥అంత॥ |
| కడుఁ బేదైనవాఁడు కాలకర్మవశమున అడుగులోనే నిధాన మటు గన్నట్టు యెడసి శ్రీవేంకటేశు నెరఁగక గురునాజ్ఞ పొడగన్నవానిభక్తి పొడముటే చాలు | ॥అంత॥ |


