అధ్యాత్మ సంకీర్తన
రేకు: 335-2
సంపుటము: 4-203
రేకు: 335-2
సంపుటము: 4-203
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నారాయణి
| ఏలికవు నీవట యింకా దైన్యమేల తాలిమి నీ చేఁతలకుఁ దగవు గాదనరా | ॥పల్లవి॥ |
| ఘనకర్మానుభవమే కావలె నొండె నాకు వనజాక్ష నీసేవే వలె నొండె కినుకఁ బూఁటయు సంకెలయు రెండు నేల ననిచి యిందుకు నిన్ను నవ్వేరుసుమ్మీ | ॥ఏలి॥ |
| పైకొని నేఁ జేసినపాపమె కావలె నొండె తూకొని నీనామముచేఁ దుంచుట యొండె సాకిరి చంకదుడ్డు శరణార్తి రెండు నేల మేకొని యీవట వింటే మెత్తురా నిన్నును | ॥ఏలి॥ |
| యిరవుగా మరపొండె యెరుక గావలె నొండె సరస రెండును నైన సంగతౌనా గరిమ శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను సరిబేసి జంటమాట జరపకు మిఁకను | ॥ఏలి॥ |


