అధ్యాత్మ సంకీర్తన
రేకు: 335-3
సంపుటము: 4-204
రేకు: 335-3
సంపుటము: 4-204
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బలహంస
| ఏమి సేతు నిందుకు మందేమైనఁ బోయరాదా సామజగురుఁడ నీతో సంగమొల్ల దేఁటికే | ॥పల్లవి॥ |
| మాయలసంసారము మరిగిన కర్మము ఈయెడ నిను మరుగ దేఁటికో హరి కాయజకేలిపైఁ దమిగలిగిన మనసు కాయజుతండ్రి నీపైఁ గలుగ దిదేఁటికే | ॥ఏమి॥ |
| నాటకపుఁగనకము నమ్మినట్టిబదుకు యేఁటికి నీభక్తి నమ్మదేలే హరి గూఁటఁబడే పదవులు గోరేటిజీవుఁడు కూటువైననిజముక్తి గోరడిఁది యేఁటికే | ॥ఏమి॥ |
| పాపపుణ్యములకె పాలుపడ్డ నేను యేపున నీపాలఁ జిక్క నేలకో హరి శ్రీపతివి నాలోని శ్రీవేంకటేశుఁడ నీపేరివాఁడ నాకు నిండుమాయ లేఁటికే | ॥ఏమి॥ |


