అధ్యాత్మ సంకీర్తన
రేకు: 335-4
సంపుటము: 4-205
రేకు: 335-4
సంపుటము: 4-205
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| తల్లియుఁ దండ్రియు మరి దైవము నాతఁడే కాక యెల్ల జీవులకు మరి యెవ్వరింక దిక్కు | ॥పల్లవి॥ |
| యీ సంసారమునకు యితఁడె దిక్కు నేఁ- జేసేటిచేఁతలకెల్ల శ్రీపతే లోను పాసిపోఁడెప్పుడు నన్ను బందువుఁడితఁడే నాకు దాసుఁడైనవాఁడు హరిఁ దగదు దూరఁగను | ॥తల్లి॥ |
| చావుఁబుట్టుగులవేళ సతము నీతఁడే సావి భోగములకు నిచ్చకుఁడీతఁడే భావములోపల నుండుప్రాణ మీతఁడే నాకు దైవము దూరగనేల తనకేమి వచ్చినా | ॥తల్లి॥ |
| తలఁపులోపలికి యీదైవమే తోడు యిలఁ గలిమిలేములు కీతఁడే తోడు పలుకులోపల నుండుభాగ్య మీతఁడె నాకు కొలిచి శ్రీవేంకటేశుఁ గొసరఁగనేఁటికి | ॥తల్లి॥ |


