అధ్యాత్మ సంకీర్తన
రేకు: 337-1
సంపుటము: 4-214
రేకు: 337-1
సంపుటము: 4-214
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళవసంతం
| దైవమొకఁడే మాతలఁపు నొకటే పావనమైతిమి పదరేమా | ॥పల్లవి॥ |
| హరి యెటు దలఁచిన నటయీని పరుగుఁ గోరికల పనులేలా ధర నభయ మొసఁగు దైవముబంట్లము మరలి యితరులకు మఱి వెరచేమా | ॥దైవ॥ |
| పురుషోత్తమానతిఁ బుట్టినవారము అరిదిసిరులకై యలపేలా సరి లక్ష్మీపతి శరణాగతులము అరయఁగ నితరుల నడిగేమా | ॥దైవ॥ |
| శ్రీవేంకటపతిచేఁత జీవులము దావతి నితరము తగులేలా వావిరిని కరివరదుని వారము తావున బందాలఁ దగిలేమా | ॥దైవ॥ |


