అధ్యాత్మ సంకీర్తన
రేకు: 337-3
సంపుటము: 4-216
రేకు: 337-3
సంపుటము: 4-216
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శోకవరాళి
| విడువుము మనసా వీరిడి చేఁతలు తడయక శ్రీహరిఁ దలఁచవొ యిఁకను | ॥పల్లవి॥ |
| నానాఁడే యెనఁబది నాలుగులక్షలు యోనుల వెడలితి నొక్కఁడనే ఆనిన భోగములందలివే పో కానము యిఁకనేమి గడియించేము | ॥విడు॥ |
| నలుగడ నటు పదునాల్గు లోకములు వెలయఁ జొచ్చితిని వెడలితిని కలిగినదేదో కలుగనిదేదో తెలియ దేమిటికిఁ దిరిగేవమో | ॥విడు॥ |
| భువిలోఁ జేసితి పుణ్యముఁ బాపము కవిసి యాఫలము గైకొంటిని యివల శ్రీవేంకటేశుఁడింతలో తవిలి యేలఁగా ధన్యుఁడనైతి | ॥విడు॥ |


