అధ్యాత్మ సంకీర్తన
రేకు: 337-5
సంపుటము: 4-218
రేకు: 337-5
సంపుటము: 4-218
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిజ్జిజ్జి
| పాపముఁ బుణ్యము పరగ నొకట నదె వోపినవారలు వొడిఁ గట్టెడిది | ॥పల్లవి॥ |
| నాలుకతుదనే నానారుచులును నాలుకవే హరినామమును పోలింప నొక్కటి భోగమూలము మూల నొకటది మోక్షమూలము | ॥పాప॥ |
| మనసున నదివో మగువలమోహము అనుగుమనసుననె హరిచింత పనివడి యొక్కటె ప్రపంచమార్గము కొన నొకటే వైకుంఠమార్గము | ॥పాప॥ |
| వెలుఁగుఁ జీఁకటియు వెస నొకనాఁడే కలిగె నట్ల నివి కలిగినవి యిలలో శ్రీవేంకటేశు మా యొకటి తలఁప నొక టతనిదాసులసుగతి | ॥పాప॥ |


