అధ్యాత్మ సంకీర్తన
రేకు: 337-6
సంపుటము: 4-219
రేకు: 337-6
సంపుటము: 4-219
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రం
| హరిదాసులే మాకు నడ్డమై కాతురు గాక శరణంటి వారికి నే సకలోపాయములు | ॥పల్లవి॥ |
| పెరుగఁబెరుఁగఁగానే పెద్దలాయ నింద్రియాలు యిరవైనమాబుద్ధు లిందుగొల్పీనా తిరిగితిరిగి మాకు ద్రిష్టమాయ జన్మములు దురితాలుఁ బుణ్యాలుఁ దోసేమా యిఁకను | ॥హరి॥ |
| కూడఁగూడ నానాఁటఁ గొనకెక్కెఁ గోరికలు వీడనిబంధము లన్నీ విడిచీనా పాడితో నీడా నాడఁ బ్రాణములుఁ దీపులాయ యేడనున్ననేము నేమే యెరిఁగేమా యిఁకను | ॥హరి॥ |
| చింతించఁ జింతించఁ జేతికి వచ్చె మనసు అంతలో శ్రీవేంకటేశుఁ డంది కాచెను దొంతులై తిరుమంత్రము తోడనే నాలుక నంటె మంతనాన గురుసేవ మరచేమా యిఁకను | ॥హరి॥ |


