Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 338-2
సంపుటము: 4-221
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
ఇన్నిజన్మము లెత్తిన యిం(దిం?)దుకా నేము
పన్నిన సంసారముల బంధమే మిగిలెను
॥పల్లవి॥
తీరెఁ దీరె అన్నములు దినదినకోరికలు
కోరఁబోతే యాసలెల్ల కోటానఁగోటి
సారెఁ గొన్నరుచులెల్ల చవితో మేనిలో లేవు
ఆరితేరిబతుకఁగా నాసలే మిగిలెను
॥ఇన్ని॥
పోయఁబోయ స్వర్గాదిభోగములు వెనకకే
సేయఁబోతే పుణ్యములు సేనాసేన
ఆయమంటి వెతకితే నాతుమలోనా లేవు
కాయముతో వెంట వెంట కర్మమే మిగిలెను
॥ఇన్ని॥
అందెనందె మోక్షము హరిదాసులవల్లను
ముందు వెనకెంచితేను మూలమే హరి
గొందిఁ జిక్కె నరకాలు కోపముఁ బాపముఁబాసె
యిందు నందు శ్రీవేంకటేశుఁడే మిగిలెను
॥ఇన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము