అధ్యాత్మ సంకీర్తన
రేకు: 338-6
సంపుటము: 4-225
రేకు: 338-6
సంపుటము: 4-225
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| బంటుకు బంటవుదురా పాపముగాక నీ- బంటుకు బంట్లమై బదికేము నేము | ॥పల్లవి॥ |
| పాతాళముననున్న బలివాకిలి గాచేవు దూతవై పాండవుల పొందున నుంటివి యీతల యేలిక బంటు యీవరుస దప్పె నిఁక చేతనే నిన్నుఁగొలువఁ జింతయ్యీ నిందుకే | ॥బంటు॥ |
| పాండవులదూతవై పనిసేసితివి వారు అండ నీదూతలయ్యేది అమరుఁగాక నిండి గురు దైవమనే నియమము దప్పె నిదే మెండు నీదాసులకెల్ల మేర మితి యేదయ్యా | ॥బంటు॥ |
| పరగ నౌలే నీవు భక్తవత్సలుండ వౌదు తిరమై యెరఁగకాడితిమి యిందాఁకాను అరుదైన శ్రీవేంకటాద్రీశుఁడవు నీకు సిరులనే శరణంటిఁ జేసినట్టు సేయవే | ॥బంటు॥ |


