అధ్యాత్మ సంకీర్తన
రేకు: 339-5
సంపుటము: 4-230
రేకు: 339-5
సంపుటము: 4-230
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
| ఊరకే నోరుమూసుక వొంటి నీకు మొక్కేమయ్య చేరి నారాయణ నీవు చేసినట్టు సేయవే | ॥పల్లవి॥ |
| హరినామముఁ దలఁచి అణఁచేనంటేనయ్య సరి నా పాతకములు చాల వందుకు నరహరినామ మెంచి నాకుఁ గూడపెట్టేనంటే అరుదైన పుణ్యములు అన్నిలేవు భూమిని | ॥ఊర॥ |
| రామనామము నొడిగి రవ్వల బోఁజోఁపే నంటే తామసపునరకాలు దగ్గరవందు వామననామమెంచి వరస్వర్గ మెక్కేనంటే యేమిటా నాకడ వారికెడచా దదియు | ॥ఊర॥ |
| గోవిందనామముచేతఁ గుదించే భవములంటే పావనమాయను నీభక్తివల్లను శ్రీవేంకటేశ నేను చేకొని నీశరణంటి యేవిధులు నెరఁగను యిదివో నీచిత్తము | ॥ఊర॥ |


