అధ్యాత్మ సంకీర్తన
రేకు: 339-6
సంపుటము: 4-231
రేకు: 339-6
సంపుటము: 4-231
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
| జ్ఞానంబొకటే జగమున కధికం మరి నానావిధములు నటనలు | ॥పల్లవి॥ |
| బహుదానఫలము పడయుటకంటే యిహమున వైరాగ్య మెక్కుడు సహజకర్మములు శతములకంటే అహిశయనుని భక్తధికము | ॥జ్ఞానం॥ |
| ధరఁ దపములనంతంబులకంటే గరిమల శాంతము ఘనము విరసాచారము వేవేలకంటే హరినామపఠన మధికము | ॥జ్ఞానం॥ |
| ఆవల వ్రతములు అన్నిటికంటే శ్రీవైష్ణవమే శేఖరము శ్రీవేంకటేశ్వరుచేఁతలె యివిగన సేవ యిదొకటే చింతింప ఘనము | ॥జ్ఞానం॥ |


