అధ్యాత్మ సంకీర్తన
రేకు: 340-3
సంపుటము: 4-234
రేకు: 340-3
సంపుటము: 4-234
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| అనుచుఁ బొగడఁ జొచ్చేరదె బ్రహ్మాదులు మింట మొనసి యీ బాలునికే మొక్కేము నేము | ॥పల్లవి॥ |
| వున్నతపు లోకములు వుదరాన నున్నవాఁడు అన్నువ నీ దేవకిగర్భమందు వుట్టెను మన్నించి యోగీంద్రులమదిలోనుండెడువాఁడు పన్నిన పొత్తులలోన బాలుఁడై వున్నాఁడు | ॥అను॥ |
| పాలజలధిలోన పాయనిగోవిందుఁడు పాలు వెన్న లారగించె పైఁడికోరను వోలిఁ దన విష్ణుమాయ నోలలాడినట్టివాఁడు చాలి మంత్రసానులచే జలకమాడీని | ॥అను॥ |
| ముగురువేల్పులకు మూలమైన యట్టివాఁడు తగుబలభద్రునికి తమ్ముఁడాయను నిగిడి వైకుంఠమున నిలిచి రేపల్లెనుండి యెగువ శ్రీవేంకటాద్రి నిరవాయ వీఁడే | ॥అను॥ |


