అధ్యాత్మ సంకీర్తన
రేకు: 341-2
సంపుటము: 4-239
రేకు: 341-2
సంపుటము: 4-239
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| తొల్లి యేరుపరచిరి దొడ్డవాఁడు హరియని యెల్ల సందేహాలు బాసె నిఁకనేల చింత | ॥పల్లవి॥ |
| నారదుఁడు సోదించి నారాయణు నెరిఁగె సారెకు శివుఁ డెరిఁగి చాటె రాముని చేరి సోదించెఁ బార్వతి శ్రీరామచంద్రుని యేరీతుల సోదించేము యింతకంటె నేము | ॥తొల్లి॥ |
| వేదవ్యాసులు దెలిసే వెదకి విష్ణునిఁ జెప్పె సాదించితని యోగిసనకాదులు యీదెస శుకాదులెల్ల నెరిఁగిరి మాధవుని కాదని వీరికంటె గతి గానఁగలమా | ॥తొల్లి॥ |
| పెక్కుగాలము చదివి పెక్కేండ్లుబదికి పెక్కు రుషులిందుననె పెద్దలైరి దక్కఁగ శ్రీవేంకటేశు ధనముగాఁ జూపి రిదె తక్కక కొలిచితిమి దైవమని కంటిమి | ॥తొల్లి॥ |


