అధ్యాత్మ సంకీర్తన
రేకు: 343-1
సంపుటము: 4-250
రేకు: 343-1
సంపుటము: 4-250
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| మానరో వో లోకులాల మాకు మీకు నేమి దోడు నాఁటికిఁక మీకు నవ్వుఁబాటు నేము | ॥పల్లవి॥ |
| యిరవై నానోటికి యెన్నెన్ని చదివిన హరియనేయంతరుచి అందు లేదు గరిమ నెన్నిరూపులు కన్నుల నేఁ జూచినాను పురుషోత్తముఁ జూచినపూర్తి యందు లేదు | ॥వన॥ |
| యెచ్చోట నుండినాను యిందిరేశుమందిరము చొచ్చి యుండేసుఖ మంత చొప్పడ దందు కచ్చుపెట్టి వీనులకుఁ గతలెన్ని విన్నాను అచ్చుతుకీర్తన వినేయందు సరి రాదు | ॥వన॥ |
| కైపుగాఁగ కన్నవారికాళ్ళకు మొక్కినాను శ్రీపతికిమొక్కినంత సెలవు గాదు యేపున శ్రీవేంకటేశు నిటులఁ బూజించినట్టు మాపుదాఁకా నితరుల మనసురాదు | ॥వన॥ |


