అధ్యాత్మ సంకీర్తన
రేకు: 343-2
సంపుటము: 4-251
రేకు: 343-2
సంపుటము: 4-251
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| పట్టిన ముట్టనుండరు పదరుదు రంతలోనే యెట్టనె(యే?)దుటిమిమ్ము నెరిఁగీ నెరఁగరు | ॥పల్లవి॥ |
| గుక్కక మూఁడులోకాలు గొలిచితివని నీకు మొక్కుదురు; పరులకు మొక్కకుండరు అక్కరదీర శ్రీపతివని నిన్ను వేఁడుదురు వెక్కసపుఁ దైవాల వేఁడుకోక మానరు | ॥పట్టి॥ |
| కందువ బ్రహ్మగన్నట్టి ఘనుఁడవు నీవార- మందురు; పరులవారమనకుండరు అంది వేదాలు దెచ్చేయాతఁడవు నీవే యని యెందు నెంచి, పరులను యెంచకుండరు | ॥పట్టి॥ |
| యిత్తల నారదాదుల కేలికని నీమరఁగు చొత్తురు; పరులమాఁటు చొర కుండరు అత్తిన శ్రీవేంకటేశ యన్నియు నీమాయలింతే యెత్తిన వెఱ్ఱులు లోకులిట్టే భ్రమతురు | ॥పట్టి॥ |


